Indrakeeladri Navaratri: ఆరవ రోజుకు దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరిగా దుర్గమ్మ
ABN , Publish Date - Sep 27 , 2025 | 09:16 AM
అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంపభౌతికశకే లలితా. పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటిగా ఇమిడి ఉన్నాయి.
విజయవాడ, సెప్టెంబర్ 27: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజుకు దసరా ఉత్సవాలు చేరుకున్నాయి. ఈరోజు దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. దసరా వేడుకల్లో అమ్మవారు 6 వ రోజున శ్రీలలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు.
అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంపభౌతికశకే లలితా. పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటిగా ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. ఇన్నిటిలోను ఉండే శక్తి మరొకటి ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం భారతీయులది సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది.
ఇవి కూడా చదవండి..
నేడు బిజి బిజీగా సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణలో భారీగా IAS, IPSల బదిలీలు.. నగర సీపీగా సజ్జనార్
Read Latest AP News And Telugu News