CM Revanth Reddy: నేడు బిజి బిజీగా సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Sep 27 , 2025 | 08:28 AM
నేడు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 50 ఏటీసీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఏటీసీ ఇవాళ్టీ(శనివారం) నుంచి అమలులోకి రానుంది. మధ్యాహ్నం 3 గంటలకు శిల్పారామంలో టూరిజం కార్నివాల్లో సీఎం పాల్గొననున్నారు.
హైదరాబాద్: నేడు వరుస కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజిబిజీగా ఉన్నారు. ఈ మేరకు అధికారులు ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐఐటీ కాలేజీలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా ప్రభుత్వం అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ సెంటర్లు విద్యార్థులకు ఆధునిక శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఈ నేపథ్యంలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 50 ఏటీసీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఏటీసీ ఇవాళ్టీ(శనివారం) నుంచి అమలులోకి రానుంది. మధ్యాహ్నం 3 గంటలకు శిల్పారామంలో టూరిజం కార్నివాల్లో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశంలో రూ. 15 వేల కోట్ల టూరిజం డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు శిల్ప కళావేదికలో నిర్వహిస్తున్న ఉద్యోగ జాతర కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 563 గ్రూప్-1 ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, విద్య, ఉద్యోగాలు, పర్యావరణ పరిరక్షణలో చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు