Heavy Rains Alert Issued: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజల్ని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ సంస్థ..
ABN , Publish Date - Sep 27 , 2025 | 07:41 AM
ఈ రోజు (శనివారం) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
అమరావతి: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం ఏర్పడింది. గడిచిన 6 గంటల్లో.. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయుగుండం ప్రస్తుతానికి పూరీకి 60 కిలోమీటర్లు.. గోపాల్‌పూర్(ఒడిశా)కి 70 కిలోమీటర్లు, కళింగపట్నం(ఏపీ)కి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను వాయుగుండం దాటనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ రోజు (శనివారం) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వాతావరణ శాఖ హెచ్చరికలు..
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
మూసీ ఉగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..