Kanaka Durga Navaratri: ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:51 AM
అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
విజయవాడ, అక్టోబర్ 1: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు(Kanaka Durga Navaratri) ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో పదవ రోజుకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ... పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
నవరాత్రి మహోత్సవాల్లో వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిలకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు మంచి నీరు, పండ్లను అందజేశారు. ప్రతీరోజు ఒక్కో అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
తెప్పోత్సవంపై ఉత్కంఠ...
మరోవైపు కృష్ణా నదికి భారీ వరద నేపథ్యంలో అమ్మవారి తెప్పోత్సవంపై ఉత్కంఠ నెలకొంది. తెప్పోత్సవానికి ఎన్ఓసీ ఇవ్వడానికి జలవనరుల శాఖ నిరాకరించింది. 2022, 2023 సంవత్సరాలలో దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. మహా మండపంలో ఉత్సవమూర్తులను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు అధికారులు. గత ఏడాది వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నది ఒడ్డున హంస వాహనంపై పూజా కార్యక్రమం మాత్రమే నిర్వహించారు. మరి ఈ ఏడాది కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో అమ్మవారి తెప్పోత్సవంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
కాస్త నిలకడగా కృష్ణానది.. అయినప్పటికీ
అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో అద్బుత ఘట్టం
Read Latest AP News And Telugu News