Arasavalli : అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో అద్బుత ఘట్టం ఆవిష్కృతం
ABN , Publish Date - Oct 01 , 2025 | 07:04 AM
అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో ఈ ఉదయం అద్బుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూల విరాట్‌ను సూర్య కిరణాలు తాకాయి. ఇవాళ్టి కిరణ స్పర్శ సందర్భంగా ఆ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు..
శ్రీకాకుళం, అక్టోబర్ 1: అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో ఈ ఉదయం(బుధవారం) అద్బుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూల విరాట్‌ను సూర్య కిరణాలు తాకాయి. ఇవాళ్టి కిరణ స్పర్శ సందర్భంగా ఆ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయానికి మారే సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి ఏడాదిలో రెండు సార్లు కిరణ స్పర్శ జరుగుతుంది. సుమారు 6 నిమిషాలు పాటు స్వామి వారి పాదాలు నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ జరిగింది. ప్రతీ ఏటా అక్టోబర్ 1, 2, మార్చి 9,10 తేదీల్లో సూర్య కిరణాలు స్వామి వారి పాదాలు తాకడం ఆనవాయితీ.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం