Festive Relief for Small Contractors: పండగ వేళ చిన్న కాంట్రాక్టర్లకు ఊరట.. బిల్లుల చెల్లింపులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Oct 01 , 2025 | 07:51 AM
దసరా పండగ సందర్భంగా ఏపీలోని చిన్న కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2014-19 మధ్య కాలంలో రూ. 5 కోట్ల లోపు చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి: దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న కాంట్రాక్టర్లకు ఏపీ ఆర్థిక శాఖ శుభవార్త తెలిపింది. 2014-19 మధ్య కాలంలో రూ. 5 కోట్ల లోపు చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 5 లక్షల్లోపు చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని అనేక మంది కాంట్రాక్టర్లు గత ఆరేళ్లుగా తమ బిల్లుల కోసం వేచిచూస్తున్నారు.
ప్రస్తుతం ఆ బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించగా, ఆర్థిక శాఖ వెంటనే చర్యలు ప్రారంభించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు రూ.400 కోట్ల మేర బకాయి బిల్లులు విడుదల కానున్నట్లు అంచనా. ఇప్పటికే కొన్ని దఫాలుగా చెల్లింపులు చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు దసరా పండగ సందర్బంగా మరోసారి పెద్ద ఎత్తున చెల్లింపులను ప్రారంభించింది. చిన్న కాంట్రాక్టర్ల ఖాతాల్లో ఒకటి రెండు రోజుల్లోనే బిల్లుల సొమ్ము జమ కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది వేలాది కుటుంబాలకు పండుగ సంబరాల్లో ఆనందాన్ని అందించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !
Read Latest Telangana News and National News