Krishna River Flood: కాస్త నిలకడగా కృష్ణానది.. అయినప్పటికీ
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:23 AM
శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 5.90 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.93 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 5.16 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.32లక్షల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 5.35 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.53లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.
అమరావతి, అక్టోబర్ 1: గత కొద్ది రోజులుగా ఉరకలెత్తిన కృష్ణా నది వరద ప్రవాహం ఇప్పుడు కాస్త నిలకడగా ఉంది. కృష్ణా, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్‌తో గడిపారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వరద ముంచుకు వస్తే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు కృష్ణా నది వరద ప్రవాహం కాస్త తగ్గడం కొంతమేర ఉపశమనమనే చెప్పుకోవాలి.
అటు శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 5.90 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.93 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 5.16 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.32లక్షల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 5.35 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.53లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,68,981 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ వద్ద ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
కొనసాగుతున్న వరద...
నంద్యాల జిల్లాలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 10 రేడియల్ క్రెస్ట్ గేట్లు 23 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 5.90 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 5.93 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రస్తుతం నీటి మట్టం 883.10 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 205.2258 టీఎంసీలుగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
పండగ వేళ చిన్న కాంట్రాక్టర్లకు ఊరట.. బిల్లుల చెల్లింపులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో అద్బుత ఘట్టం ఆవిష్కృతం
Read Latest AP News And Telugu News