Share News

Shiva Rajkumar On Chandrababu: చంద్రబాబు బయోపిక్‌లో నటించడానికి సిద్ధం

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:13 PM

మంచి దర్శకుడు దొరికితే ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్‌‌లో నటించటానికి సిద్ధంగా ఉన్నట్లు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం.. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో మంచి పాత్రలో తాను నటిస్తున్నట్లు వెల్లడించారు.

Shiva Rajkumar On Chandrababu: చంద్రబాబు బయోపిక్‌లో నటించడానికి సిద్ధం
Shiva Rajkumar On Chandrababu

విజయవాడ: కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మెన్ బొర్రా రాధాకృష్ణ, అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దుర్గమ్మ చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటుడు శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా పాజిటివ్‌గా అనిపించిందని తెలిపారు.


ప్రస్తుతం తాను తెలుగులో రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లో విలువలతో కలిగిన వ్యక్తి బయోపిక్‌లో నటించటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్‌తో మంచి దర్శకుడు ఎవరైనా ముందుకు వస్తే చంద్రబాబు క్యారెక్టర్‌లో నటించటానికి తాను సిద్ధంగా ఉన్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.


ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో మంచి పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగానే తెలుగు ప్రజలు తనను ఆదరిస్తారని ఆశిస్తున్నానన్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానన్నారు. గుమ్మడి నరసయ్య ఏ విధంగా ప్రజలకు సేవలు అందించారో ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు వెల్లడించారు. రేపు పాల్వంచలో ప్రజల మధ్యన చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం చేయనున్నట్లు శివ రాజ్‌కుమార్ వ్యాఖ్యానించారు.


Also Read:

మీకు 40 ఏళ్లు ఉంటే.. ఈ 5 అలవాట్లు మార్చుకోండి.!

వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన

For More Latest News

Updated Date - Dec 05 , 2025 | 01:23 PM