Home » Shiv Raj Kumar
మంచి దర్శకుడు దొరికితే ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్‌లో నటించటానికి సిద్ధంగా ఉన్నట్లు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం.. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో మంచి పాత్రలో తాను నటిస్తున్నట్లు వెల్లడించారు.
కమల్‌హాసన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ శివ రాజ్‌కుమార్ చెప్పారు. అన్ని భాషలూ మనకు ముఖ్యమేనని, అయితే మాతృభాష విషయానికి వచ్చేసరికి కన్నడానికే తమ మొదట ప్రాధాన్యత అని అన్నారు.
కన్నడ లెజెండరీ నటుడు దివంగత రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) కన్నడం లో బాగా పేరున్న కథానాయకుడు. అతను నటించిన 125వ సినిమా 'వేద' (Vedha) కన్నడంలో గత ఏడాది డిసెంబర్ 23న విడుదలైంది. అదే సినిమాని శివవేద (Shiv Vedha) అనే పేరుతో తెలుగులో ఈరోజు, అంటే ఫిబ్రవరి 9 న విడుదల చేశారు.