Share News

Maoists: వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:32 AM

మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

Maoists: వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల  సంచలన ప్రకటన
Maoists

విజయవాడ, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు సంచలన ప్రకటన (Maoists Sensational Letter) చేశారు. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను ఇవాళ(శుక్రవారం) విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు.


మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనేది అవాస్తవమని తెలిపారు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని మండిపడ్డారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారకులని తెలిపారు. అక్టోబరు 27వ తేదీన చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని పేర్కొన్నారు. అనంతరం హిడ్మాను పోలీసులు పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే 13 మందిని పట్టుకొని హత్య చేశారని విమర్శించారు. హత్యను కప్పిపుచ్చేందుకు మారేడుమల్లి రంపచోడవరం ఎన్‌కౌంటర్ల కట్టుకథ అల్లారని ధ్వజమెత్తారు. హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇదని ఆరోపించారు. హిడ్మా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేర్కొన్నారు.


కాగా, మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. మావోయస్టుల చర్యలను భద్రత బలగాలు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఆపరేషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలోని మారేడుమిల్లిలో భద్రత బలగాలు ఇటీవల మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..

Read Latest AP News and National News

Updated Date - Dec 05 , 2025 | 12:24 PM