TTD: భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 05 , 2025 | 10:22 AM
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
తిరుమల, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారుగా 15 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ, పర్వ దినాల నేపథ్యంలో డిసెంబరు, జనవరిలో పలు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను (VIP Break Darshan) రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఇవాళ(శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేసింది.
డిసెంబరు 23వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో డిసెంబరు 29, 30వ తేదీల నుంచి జనవరి 8వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది. అలాగే జనవరి 25వ తేదీన రథసప్తమి దృష్ట్యా ప్రోటోకాల్ ప్రముకులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్
శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..
Read Latest AP News and National News