Share News

Vijayawada Festival Crowd: దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై అరుదైన రికార్డ్

ABN , Publish Date - Oct 03 , 2025 | 12:09 PM

అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి.. దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ అమ్మను కనులారా చూసుకుని భక్తులు పుణీతులయ్యారు. ఇదిలా ఉండగా.. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో రికార్డు నెలకొంది.

Vijayawada Festival Crowd: దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై అరుదైన రికార్డ్
Vijayawada Festival Crowd

విజయవాడ, అక్టోబర్ 3: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ ఆలయంలో (Vijayawada Durgamma Temple) దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఏడాది 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరిగాయి. ఈ మహోత్సవాల్లో దుర్గమ్మ వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి.. దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ అమ్మను కనులారా చూసుకుని భక్తులు పుణీతులయ్యారు. ఇదిలా ఉండగా.. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో రికార్డు నెలకొంది. గత ఏడాది కంటే 10 శాతం భక్తుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది దుర్గమ్మను 15 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ 11 రోజుల్లో దుర్గమ్మ ఆలయ ఆదాయం రూ.4.38 కోట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు.


అరుణమయంగా ఇంద్రకీలాద్రి

మరోవైపు.. దసరా ఉత్సవాలు ముగియడంతో ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు మొదలయ్యాయి. భవానీలు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్నారు. భవానీల కోసం అన్ని క్యూలైన్లను ఉచితంగానే దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు. భవానీ నామస్మరణతో ఇంద్రీకీలాద్రి మార్మోగుతోంది. వన్ టౌన్ వినాయకుడి గుడి వరకు క్యూ లైన్‌లో భవాని భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఇంద్రకీలాద్రి అరుణమయంగా మారింది. జై భవాని జై జై భవాని నామస్మరణతో దుర్గమ్మ సన్నిధి మారుమోగుతోంది.


ఇవి కూడా చదవండి...

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. సీఎం సీరియస్

రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 12:21 PM