Share News

Ambedkar statue fire: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. సీఎం సీరియస్

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:49 AM

విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు ఆగంతకులు రాత్రి నిప్పు పెట్టడటంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం.

Ambedkar statue fire: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. సీఎం సీరియస్
Ambedkar statue fire

అమరావతి, అక్టోబర్ 3: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆరా తీశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న కారణంగా జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు ఆగంతకులు రాత్రి నిప్పు పెట్టడటంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం.


ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఘనటపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


కాగా.. చిత్తూరు జిల్లా దురుకుప్పం మండలం దేవలంపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంపై స్థానిక దళిత సంఘాలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

బావను రోడ్డుపై పరిగెత్తించిన మరీ చంపేసిన బావమరుదులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 12:14 PM