Man Beaten To Assasinate: బావను రోడ్డుపై పరిగెత్తించిన మరీ చంపేసిన బావమరుదులు..
ABN , Publish Date - Oct 03 , 2025 | 09:55 AM
సోనుతో గొడవపెట్టుకున్నారు. అతడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టసాగారు. దీంతో సోను ప్రాణ రక్షణ కోసం పరుగులు పెట్టాడు. అయినా వాళ్లు వదలలేదు. హైవేపై సోనును వెంటాడి, వేటాడి చావకొట్టారు.
బావమరిదులంటే బావ బతుకుకోరతారు అంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం బావ ప్రాణం తీసేశారు. హైవేపై పరుగులు పెట్టించి మరీ చంపేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హపుర్‌కు చెందిన సోను, అతడి భార్య బుధవారం ఉదయం గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమె బులందర్‌షహర్‌లో ఉన్న తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
దీంతో సోను బావమరిదులు హుటాహుటిన హపుర్ వచ్చారు. సోనుతో గొడవపెట్టుకున్నారు. అతడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టసాగారు. దీంతో సోను ప్రాణ రక్షణ కోసం పరుగులు పెట్టాడు. అయినా వాళ్లు వదలలేదు. హైవేపై సోనును వెంటాడి, వేటాడి చావకొట్టారు. తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. కుటుంబసభ్యులు తీవ్ర గాయాల పాలైన సోను ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు.
దీనిపై సోను తల్లి సుఖ్‌విరి మాట్లాడుతూ.. ‘భార్యాభర్తలన్న తర్వాత భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వారి గొడవకు కారణం ఏంటో నాకు తెలీదు. నా కొడుకు తన భార్యకు ఎందులోనూ లోటు చేయలేదు. ఆమె కోసం ఓ సారి పొలం అమ్మాడు. నా నగను కూడా తను తీసుకుంది. బావమరిదులు నా కొడుకుకు తాగడానికి ఏదో ఇచ్చారు. తర్వాత కొట్టి చంపారు’ అని అంది. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వేగంగా స్పందించి తప్పించుకున్నాడు.. లేదంటే ప్రాణాలు పోయేవి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..