Auto Driver Narrowly Escapes: వేగంగా స్పందించి తప్పించుకున్నాడు.. లేదంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Oct 03 , 2025 | 09:27 AM
ఆటోను అక్కడే ఆపేసి కిందకు దిగి పరుగులు పెట్టాడు. హోర్డింగ్ ఆటో ముందు భాగంలో పడింది. ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ఆటో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకు ఏమీ కాలేదు.
ఉత్తర భారత దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. మహారాష్ట్రలో గత రెండు, మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి ముంబై నగరంలో అత్యంత భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు రిస్క్‌లో పడ్డాయి. ఆటో నడుపుకుంటూ రోడ్డుపై వెళుతుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.
సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి ఓ ఆటో ముంబైలోని ఓ బిజీ రోడ్డు వెళుతోంది. ఆ సమయంలో వర్షం విపరీతంగా పడుతోంది. ఆటో ఎల్ఐసీ హోర్డింగ్ పెట్టిన ప్రాంతంలోకి వచ్చింది. భారీ గాలి వాన కారణంగా హోర్డింగ్ కుప్పకూలటం మొదలైంది. ఆటో హోర్డింగ్‌కు అత్యంత దగ్గరగా వచ్చింది. హోర్డింగ్ వేగంగా కూలటం స్టార్ట్ అయింది. ఇది గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే స్పందించాడు.
ఆటోను అక్కడే ఆపేసి కిందకు దిగి పరుగులు పెట్టాడు. హోర్డింగ్ ఆటో ముందు భాగంలో పడింది. ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ఆటో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకు ఏమీ కాలేదు. కొద్దిసేపటి తర్వాత వారు కిందకు దిగిపోయారు. ఆటో డ్రైవర్ వేగంగా స్పందించటం కారణంగానే అతడి ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో ముంబైలోని ఘట్కోపార్ ప్రాంతలో హోర్డింగ్ మీద పడి 17 మంది చనిపోయారు. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
ఢిల్లీలో ఆర్చరీ లీగ్-2025 ప్రారంభించిన రామ్ చరణ్