To Day Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Oct 03 , 2025 | 08:55 AM
నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,18, 690 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,08,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 89,020 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోయింది. భూముల మీద పెట్టుబడులు పెట్టిన వాళ్లు, బంగారం మీద పెట్టుబడులు పెట్టిన వారు నష్ట పోయినట్లు చరిత్రలో లేదు అన్నట్లుగా పరిస్థితి మారింది. బంగారం ధరలు నెల,నెలకు విపరీతంగా పెరుగుతూనే పోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,18,000 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గుడ్ రిటర్న్స్ కథనం ప్రకారం ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భాగ్య నగరంలో నిన్న బంగారం ధరలు ఇలా..
నగరంలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,18, 690 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,08,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 89,020 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,18, 680 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,08,790 దగ్గర ట్రేడ్ అవుతోంది..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 89,010 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
నిన్న హైదరాబాద్ మహా నగరంలో కేజీ వెండి ధర 1,64,000 దగ్గర ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర 16,400 దగ్గర ట్రేడ్ అయింది. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు కేజీపై 100 రూపాయలు, 100 గ్రాములపై పది రూపాయలు పెరిగింది. నేడు కేజీ వెండి ధర 1,64,100 దగ్గర ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల వెండి ధర 16,410 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో ఆర్చరీ లీగ్-2025 ప్రారంభించిన రామ్ చరణ్
రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? ఆరోగ్యానికి ముప్పే!