Share News

Ram Charan: ఢిల్లీలో ఆర్చరీ లీగ్-2025 ప్రారంభించిన రామ్ చరణ్

ABN , Publish Date - Oct 03 , 2025 | 08:02 AM

రామ్ చరణ్ ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్-2025ని ప్రారంభించారు. ఆర్చరీ మన చరిత్ర, సంస్కృతిలో భాగమని చెప్పారు. ఈ లీగ్ ద్వారా.. దేశంలో దాగి ఉన్న ప్రతిభకు అవకాశాలు వస్తాయని..

Ram Charan: ఢిల్లీలో ఆర్చరీ లీగ్-2025 ప్రారంభించిన రామ్ చరణ్
Ram Charan launches Archery Premier League 2025

ఢిల్లీ, అక్టోబర్ 3: హీరో రామ్ చరణ్ ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్-2025ని ప్రారంభించారు. ఆర్చరీ క్రీడను ఒక 'ఐకానిక్ స్పోర్ట్'గా చెప్పిన చరణ్.. ఈ లీగ్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్చరీ ఫ్రాంచైజీ టోర్నమెంట్‌గా నిలుస్తుందన్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) ఏర్పాటు చేసిన ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL)2025ని ప్రారంభించడం సంతోషకరమని చరణ్ అన్నారు.


ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ప్రారంభ వేడుకలో 48 మంది ఆర్చర్లు (36 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు) ఆరు ఫ్రాంచైజీల్లో పోటీ పడుతున్నారు. ఇది రికర్వ్ అండ్ కాంపౌండ్ ఆర్చర్లు ఫ్లడ్‌లైట్స్ కింద పోటీపడే ప్రత్యేక ఫార్మాట్‌ను భారత్ కు పరిచయం చేస్తుంది.


ఈ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్‌ కూడా అయిన రామ్ చరణ్, ఆర్చరీని 'ఐకానిక్ స్పోర్ట్' అన్నారు. 'ఇది మన చరిత్ర, సంస్కృతిలో భాగం. రామాయణం, మహాభారతంలో ఆర్చరీ ఉంది. నేను RRR సినిమాలో ఆర్చర్ పాత్ర చేశాను. ఈ క్రీడతో మన సంబంధం ముడిపడిఉంది' అని చెప్పారు. భారతీయ క్రీడా ప్రియులు ఈ ఐకానిక్ స్పోర్ట్‌ను ప్రోత్సహించాలని, లీగ్‌ను ఐకానిక్‌గా మార్చాలని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.


కాగా, ఈ ఆర్చరీ లీగ్ ద్వారా.. దేశంలో దాగి ఉన్న ప్రతిభకు అవకాశాలు వస్తాయని, అదే సమయంలో భారతీయ ఆర్చరీకి అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ దక్కుతుందని AAI అధ్యక్షుడు అర్జున్ ముండా తెలిపారు. 2028, 2032 ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారుల్ని తయారు చేయడానికి కూడా ఈ లీగ్ సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఈ పోటీలు అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరుగుతాయి.


ఇవి కూడా చదవండి..

Drinking Tea Empty Stomach: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..

Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగ‌ల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లు..

Updated Date - Oct 03 , 2025 | 08:23 AM