Effects of Insufficient Sleep: రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? ఆరోగ్యానికి ముప్పే!
ABN , Publish Date - Oct 03 , 2025 | 07:44 AM
మీరు రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే, మీ ఆరోగ్యానికి ముప్పేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఫుడ్ తోపాటు నిద్ర కూడా చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని విస్మరించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు . ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరమని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. శరీరం సరిగ్గా విశ్రాంతి తీసుకోనప్పుడు, అలసట లేదా చిరాకు వస్తుంది. దీర్ఘకాలిక నిద్ర లేకపోవడం, ముఖ్యంగా రాత్రి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు . మీరు రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే, మీ ఆరోగ్యానికి ముప్పేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండె సమస్యలు
రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది.
జ్ఞాపకశక్తిని కోల్పోవడం
నిద్ర లేకపోవడం జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి దారితీస్తుంది. నిద్ర లేమి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఏకాగ్రత తగ్గే ప్రమాదం కూడా ఉంది.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది
తగినంత నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు కూడా వేగంగా వ్యాపిస్తాయి. అందుకే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బరువు పెరుగుతారు
రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు అస్థిరమవుతాయి. దీనివల్ల ఆహారం తీసుకోవడం పెరుగుతుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది.
మానసిక ఆరోగ్య సమస్యలు
నిద్ర లేకపోవడం వల్ల ఇన్సులిన్ పనితీరు దెబ్బతింటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మానసిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి వస్తాయి.
ముఖ సౌందర్యం దెబ్బతింటుంది
తక్కువ నిద్రపోవడం వల్ల మీ ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. ఇది ముడతలు, నల్లటి వలయాలకు కూడా దారితీస్తుంది.
జీర్ణ సమస్యలు
తగినంత నిద్ర లేకపోవడం వల్ల పురుషులు, స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది, ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోవడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తీవ్రమవుతాయి.
Also Read:
నాటు కోడితో ఇన్ని లాభాలా.. అందుకే ఇంత డిమాండ్..!
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు..
For More Latest News