Share News

Tenali Theft: రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

ABN , Publish Date - Oct 03 , 2025 | 10:23 AM

కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో మరో భారీ చోరీ జరిగింది. మోటూరు మధుసూదనరావు ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తలాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. 10 లక్షలు విలువ చేసే ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.

Tenali Theft: రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు
Tenali Theft

గుంటూరు, అక్టోబర్ 3: జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలో వేర్వేరు చోట్ల రెండు భారీ చోరీలు జరిగాయి. రెండు చోరీల్లో సుమారు 20 లక్షల విలువైన బంగారం, 5 లక్షల నగదు, మూడు ఐఫోన్లను దుండగులు అపహరించారు. తెలంగాణ ఐఆర్‌ఎస్ అధికారి తెనాలి చెంచుపేటలో ఓ వివాహానికి హజరయ్యారు. ఈ క్రమంలో పార్కింగ్‌లో పెట్టిన ఐఆర్‌ఎస్ అధికారి కారులో బ్యాగ్‌ను దొంగలు చోరీ చేశారు. కారు అద్దం పగలగొట్టి మరీ బ్యాగ్‌ను అపహరించారు. బ్యాగ్‌లో 3 ఆపిల్ ఫోన్‌లు, 5 లక్షలు కాష్, సుమారు 10 లక్షల విలువగల బంగారం, పాస్ పోర్ట్, క్రిడిట్ కార్డ్స్ చోరీ అయినట్టు గుర్తించారు. త్రీటౌన్ పోలీస్‌ స్టేషన్‌లో అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇక కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో మరో భారీ చోరీ జరిగింది. మోటూరు మధుసూదనరావు ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తలాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. 10 లక్షలు విలువ చేసే ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. మధుసూదన రావు రాజోలులో రైస్ మిల్ నడుపుతూ ఉండగా ఆయన భార్య పిల్లలు పండక్కి నరసరావుపేట వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు గత రాత్రి ఇంట్లోకి ప్రవేశించి నగలను అపహరించారు. ఇంటి యజమాని వచ్చి చూడగా.. 96 గ్రాముల ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెనాలి నియోజకవర్గంలో రెండు భారీ చోరీలు జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

బావను రోడ్డుపై పరిగెత్తించిన మరీ చంపేసిన బావమరుదులు..

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 10:32 AM