Share News

Vijayawada Dasara 2025: జై మహాలక్ష్మి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

ABN , Publish Date - Sep 26 , 2025 | 09:22 AM

తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారిని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

Vijayawada Dasara 2025: జై మహాలక్ష్మి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
Vijayawada Dasara 2025

విజయవాడ, సెప్టెంబర్ 26: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ (Vijayawada Kanaka Durgamma Temple) ఆలయంలో దసరా మహోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు (శుక్రవారం) శ్రీ మహాలక్ష్మీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది.


అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి

దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజున అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వ మంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


నైవేద్యం...

ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరి నివేదిస్తారు.


ఇవి కూడా చదవండి..

ట్రంప్ మళ్లీ షాకింగ్ ప్రకటన..భారత ఔషధ ఎగుమతులకు దెబ్బ..

అన్నిటా అమ్మే అందరూ ఆమే

Read latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 09:36 AM