Share News

Sharannavaratri 2025: సరస్వతీ దేవిగా దుర్గమ్మ.. కిలో మీటర్ల మేర క్యూలైన్లో భక్తులు

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:21 AM

వినాయకుని గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్‌మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. క్యూలైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్‌లోకి భక్తులను వదిలారు పోలీసులు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75 వేల మందికి పైగా భక్తులు

Sharannavaratri 2025: సరస్వతీ దేవిగా దుర్గమ్మ.. కిలో మీటర్ల మేర క్యూలైన్లో భక్తులు
Sharannavaratri 2025

విజయవాడ, సెప్టెంబర్ 29: ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్నఅమ్మ కనకదుర్గమ్మ (Kanakaduragamma Temple) సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు దుర్గమ్మ.. సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనార్ధం ఆలయానికి భక్తులు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడి వెలుపల కిలో మీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వినాయకుని గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్‌మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. క్యూలైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్‌లోకి భక్తులను వదిలారు పోలీసులు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.


ఇవాళ సరస్వతి దేవి దర్శనార్ధం 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా ఈరోజు వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. 300, 100 రూపాయల టిక్కెట్లతో పాటు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. అన్ని ఉచిత దర్శనాలనే అధికారులు కల్పిస్తున్నారు. కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సీఎం సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి..

పండుగ సందడి... ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట

బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 11:27 AM