Share News

Basara Saraswati Temple: బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 09:38 AM

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.

Basara Saraswati Temple: బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
Basara Saraswati Temple

నిర్మల్, సెప్టెంబర్ 29: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో (Basara Temple) నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాగౌరి అలంకరణలో అమ్మవారుల భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.


ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వారిని ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లలో ఉన్న భక్తులకు, చిన్నారులకు పాలు, బిస్కెట్‌లు, పండ్లను పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.


వర్గల్‌లో భక్తుల సందడి..

అటు సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి మాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం కావడంతో అక్షర అభ్యాసాల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్లో నటి కాబోయే భర్త ఆత్మహత్య

నేడు సద్దుల బతుకమ్మ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 11:29 AM