Dussehra 2025 Travel: పండుగ సందడి... ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట
ABN , Publish Date - Sep 29 , 2025 | 10:30 AM
దసరా కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దాదాపు ఏడువేలకు పైగా బస్సులను నడిపిస్తోంది ఆర్టీసీ. అలాగే స్పెషల్ బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: భాగ్యనగర వాసులు పల్లెబాట పడుతున్నారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ (Dussehra, Bathukamma Festival) కోసం ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో సిటీలో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించేశారు. అయితే నిన్నటి వరకు నగరంపై వరణుడి ప్రతాపం కొనసాగింది. కొద్దిరోజులుగా నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి. అయితే నిన్నటి నుంచి వరుణుడు కాస్త కనుకరించాడు. దీంతో పండుగకు మూడు రోజులే ఉండటంతో నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. నగరంలోని ప్రతీ బస్టాండ్‌లో ప్రయాణికుల సందడి నెలకొంది.
మరోవైపు దసరా కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దాదాపు ఏడువేలకు పైగా బస్సులను నడిపిస్తోంది ఆర్టీసీ. అలాగే స్పెషల్ బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అటు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ బస్టాండ్లతో పాటు ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాది కంటే ఈసారి ఆర్టీసీ 600 అదనపు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక మహారాష్ట్రలకు టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడిపించనుంది.
ఇవి కూడా చదవండి..
బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్లో నటి కాబోయే భర్త ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News