Sivakumar ON Indrakiladri: ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకోవడం సంతోషంగా ఉంది: శివకుమార్
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:12 AM
దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.శివకుమార్ తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు.
విజయవాడ, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో (Vijayawada Indrakiladri Kanakadurgamma Temple) దసరా ఉత్సవాలు (Dasara Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ(సోమవారం) సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. దుర్గమ్మను కర్ణాటక డిప్యూటీ సీఎం డి.శివకుమార్ (Sivakumar) దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయంలో శివకుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేద పండితులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడారు. దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోందని డిప్యూటీ సీఎం శివకుమార్ పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో సంక్షేమం: మంత్రి కొలుసు పార్ధసారధి

సరస్వతి దేవి అలంకారంలో ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ మంత్రి కొలుసు పార్ధసారధి (AP Minister Kolusu Parthasarathy) దర్శించుకున్నారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పార్ధసారధి మీడియాతో మాట్లాడారు. ఏపీ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమం్తరి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాలనలో ప్రజలకు మరింత సంక్షేమం అందాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పుకొచ్చారు.
మూలానక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం అందంగా ఉందని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు అమ్మవారి ఆశీస్సులు అన్నివేళలా ఉండాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు కార్యక్రమాలు దిగ్విజయం కావాలని కోరుకున్నానని మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.
ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయి: మంత్రి కొల్లు రవీంద్ర

సరస్వతి దేవి అలంకారంలో ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సతీ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. నేడు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అనేక ఆలయాల్లో సరస్వతి దేవి అలంకారంలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇవాళ రెండు లక్షల మంది భక్తులు దుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రతి చోట మంచి నీళ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్‌లు ఇస్తున్నారని వెల్లడించారు. వేలాది మంది భక్తులకి అన్నదానం ప్రతిరోజూ నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయని.. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో పేదలకు మంచి జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు: ఎంపీ కేశినేని శివనాథ్
నిలకడగా కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం
Read Latest AP News And Telugu News