Home » Kolusu Partha Sarathy
రాజకీయ కక్ష్యలతోనే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అతణ్ని అరెస్టు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
నూజివీడు(Nuziveedu) మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ఇదే సమావేశంలో పలు యాక్ట్‌లకు ఆమోదం కూడా లభించింది. ముఖ్యంగా.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్లో ధాన్యం సేకరణపై కీలకంగా చర్చ సాగింది...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 12గంటల వ్యవధిలో రూ.4,170 కోట్లు పెన్షన్ల(Pension Distribution) రూపంలో పంపిణీ చేసి ఎన్డీయే ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) అన్నారు. ఇవాళ(సోమవారం) ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ 95శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు.
కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హౌసింగ్, పౌర సంబంధాల శాఖ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు...
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్‌లో ఉంది. ఎందుకంటే..