Share News

AP Cabinet Meeting:ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించిన అంశాలివే

ABN , Publish Date - Aug 21 , 2025 | 07:37 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాల గురించి మంత్రి కొలుసు పార్థ సారధి మీడియాకు వెల్లడించారు.

AP Cabinet Meeting:ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించిన అంశాలివే
AP Cabinet Meeting

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాల గురించి మంత్రి కొలుసు పార్థ సారధి మీడియాకు వెల్లడించారు. 33 అంశాలకు సంబంధించి క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపినట్లు తెలిపారు మంత్రి కొలుసు పార్థ సారధి.


మంత్రి వెల్లడించిన అంశాలివే..

Kolusu-Parthasaradhi-AP-Min.jpg

  • ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం.

  • స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా దేశంలోనే మొదటి సారి ఈ పాలసీకి ఆమోదం.

  • చెత్తను రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయం పొందడం అనేది ప్రభుత్వ లక్ష్యం.

  • పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం.

  • టూరిజం వల్ల ఉపాధి అవకాశంతో పాటు ఆదాయం చేకూరుతుంది.

  • టూరిజం ప్రాజెక్టులు డెవలప్‌మెంట్ చేయాలనుకుంటే ఇన్సెంటివ్‌లు ల్యాండ్ అలాట్‌మెంట్‌కు అంగీకరించాం.

  • పెద్ద ప్రాజెక్టులు అయితే రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలి.. జాప్యాన్ని నివారించాలి.

  • భూమి కేటాయించిన మూడు నెలల్లోనే ప్రాజెక్టును ప్రారంభించాలనే నిబంధనలు ఉన్నాయి.

  • అసాధారణ డిలే ఉంటే అవసరం అయితే ప్రభుత్వం వాటిని రద్దు చేయొచ్చు.

  • అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం - 'మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్'గా మార్పునకు ఆమోదం.


  • దివిసీమ ఉప్పెన సమయంలో పునరావాసం కల్పించడంలో అత్యంత కీలక పాత్ర కృష్ణారావు పోషించారు.

  • అధికార భాషా సంఘం ఏర్పాటుకు ఆయన కీలక పాత్ర పోషించారు.

  • సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం.

  • భూ మార్పిడి జరిగిన చోట వచ్చిన డెవలప్‌మెంట్‌లో ఫీజును అక్కడే వినియోగించాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

  • గుంటూరులోని టీడీపీ ఆఫీస్‌కు ఎకరానికి రూ. 1000 చొప్పున అద్దెకు ముందుగా 33 ఏళ్లకు కాగా 99 సంవత్సరాలకు పొడిగించేందుకు ఆమోదం.

  • ఎల్ వన్ బిడ్డర్‌లకు 43, 44 ప్యాకెజీలు అప్పగింతకు కేబినెట్‌లో ఆమోదం, దీని వల్ల అమరావతి ప్రాంతానికి ఉపయుక్తంగా ఉంటుంది.

  • రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కోసం పరిపాలనా అనుమతులకు ఆమోదం.

  • సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం.

  • విట్, ఎస్‌ఆర్ఎంలకు100 ఎకరాలు చొప్పున రెండు యూనివర్సిటీల ఎక్స్‌టెన్షన్ కోసం ఇవ్వాలని నిర్ణయం.

  • వీరికి ఎకరా రూ. 2 కోట్లు చొప్పున ఇవ్వాలని నిర్ణయం.


  • గ్రామ వార్డు సచివాలయాల శాఖలో నామకరణాల మార్పు, వారి డిసిగ్నేషన్ మార్పునకు కేబినెట్‌లో ఆమోదం.

  • గత జగన్ ప్రభుత్వం 10, 11 తో ఏర్పాటు చేశారు. అయితే స్ట్రక్చర్ లోపభూయిష్టంగా ఉండటంతో ఆశించిన ఫలితం లేదు.

  • కూటమి ప్రభుత్వం త్రీ స్ట్రైర్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

  • 2,778 మందిని డిప్యూటేషన్ లేదా అపాయింట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం.

  • గత వైసీపీ ప్రభుత్వం క్వాలిటీ లేని లిక్కర్‌ను ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీ లిక్కర్ నిర్ణయానికి ఆమోదం.

  • అత్యంత తక్కువ ధరను లిక్కర్‌కు నిర్ణయించడం.. నాలుగు రాష్ట్రాల యావరేజ్ చూసి ధరలు పెట్టేందుకు మంత్రి మండలిలో నిర్ణయం.

  • మ్యాన్యువల్ స్కావేంజర్స్ నియామకాన్ని నిషేదించి వారికి పునరావాసం కల్పించేందుకు నిర్ణయం.

  • ఏపీ బెగ్గింగ్ నిషేధ చట్టంలో సవరణ చేయడానికి నిర్ణయం.

  • చిత్తూరులోని 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు అదనంగా 56 పోస్టులతో అప్‌గ్రేడ్‌కు మంత్రిమండలి ఆమోదం.

  • ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇచ్చేందుకు డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

  • చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్‌లో ఆమోదం.

  • నాలా చట్టాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 08:06 PM