Share News

Jyotula Nehru VS YSRCP: టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

ABN , Publish Date - Aug 21 , 2025 | 06:03 PM

గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ బురద జల్లుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ ఆరోపణలు అన్ని అవాస్తావాలని చెప్పుకొచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క ప్రోటోకాల్ తప్పా ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.

Jyotula Nehru VS YSRCP: టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Jyotula Nehru

కాకినాడ, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ (YSRCP) బురద జల్లుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ (Jyotula Nehru) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ ఆరోపణలు అన్ని అవాస్తావాలని ఫైర్ అయ్యారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క ప్రోటోకాల్ తప్పా ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు గుంపులు గుంపులుగా తిరుపతి దర్శనానికి వెళ్లేవారని గుర్తుచేశారు జ్యోతుల నెహ్రూ.


ఇప్పుడు అలాంటి సంఘటన ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హిందువా లేక నాస్తికుడా అని నిలదీశారు. కరుణాకర్ రెడ్డి ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి గతంలో తిరుపతి కొండపై ఉంది నల్లరాయి, ఆ రాయిని పూజిస్తే ఏమి వస్తోందని మాట్లాడారని మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడు తిరుపతిలో కార్ డ్రైవర్‌లు దర్శనం టిక్కెట్లు అమ్మేవారని ఆరోపించారు జ్యోతుల నెహ్రూ.


వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కరుణాకర్ రెడ్డి హిందూమత ధర్మాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. గత వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ ఒక్క రోజులో పాడైపోయేదని తెలిపారు. ఇప్పుడు తిరుపతి లడ్డూ, అన్న ప్రసాదానికి పూర్వ వైభవం తీసుకుచ్చిన ఘనత తమదని జ్యోతుల నెహ్రూ ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 06:07 PM