CM Chandrababu Strong Warning to MLAs: ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:40 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేబినెట్ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేతలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.
అమరావతి, ఆగస్టు21, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో కేబినెట్ (Cabinet Meeting) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేతలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహారిస్తే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో క్రిమినల్ మాఫియా ఒకటి తయారైందని ధ్వజమెత్తారు. వీళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు వారి పరిధిలోని ఎమ్మెల్యేలను పిలిపించి వెంటనే మాట్లాడాలని సూచించారు సీఎం చంద్రబాబు.
ఏడుగురు ఎమ్మెల్యేల తీరుపై ఫైర్...
ఉదయం కేబినెట్ సమావేశానికి ముందు సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్‌తో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో మంత్రులు పాల్గొన్నారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో కూడా పలు జాగ్రత్తలను మంత్రి లోకేష్ సూచించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు వ్యవహారించిన తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి విషయం మంత్రులు లోకేష్ దగ్గర ప్రస్తావించారు. ఇలా రోడ్డు మీద పడి దాడి చేయడం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం బాగా జనంలోకి వెళ్లాయని తెలిపారు మంత్రి నారా లోకేష్.
పులివెందుల మనం గెలిచిన విషయం కూడా ప్రజల్లోకి వెళ్లిందని.. కానీ ఈ సమయంలో ఎమ్మెల్యేలు ఇలా చేస్తే అది ఎక్కువగా జనంలోకి వెళ్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు అందరినీ కట్టడి చేయాలని లోకేష్ చెప్పుకొచ్చారు. వీరిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. లేడీ డాన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెరోల్ ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనితకి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు పెరోల్ కోసం సిఫార్సు చేసిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సునీల్ పేరును లోకేష్ ప్రస్తావించారు. అందుకనే ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 23వ తేదీన మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అవుతారని వెల్లడించారు. జిల్లా పార్టీ కమిటీలు, ఇతర కమిటీల నియామకంపై ఈ భేటీలో చర్చిస్తారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్‌పై బొత్స సత్యనారాయణ క్లారిటీ
ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా
Read Latest AP News and National News