Botsa : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్‌పై బొత్స సత్యనారాయణ క్లారిటీ
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:43 PM
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్‌పై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసిపి విధానం అని..
రాజమండ్రి, ఆగస్టు 21 : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్‌పై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసిపి విధానం అని బొత్స చెప్పుకొచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు అదే విధంగా ఎన్.డి.ఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పారు. తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థన పరిగణలోకి తీసుకునేది కాదన్న బొత్స.. అలాగైతే ఎన్.డీ.ఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి దక్షిణాదికి చెందిన వారు కదా అని బొత్స ఎదురు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం
భారీ వర్షాలు, వరదలు.. నిలిచిన రాకపోకలు
For More TG News And Telugu News