Kesineni Sivanath on Indrakiladri: ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు: ఎంపీ కేశినేని శివనాథ్
ABN , Publish Date - Sep 29 , 2025 | 08:19 AM
మూలా నక్షత్రం రోజైన నేడు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
విజయవాడ, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో (Indrakiladri Kanakadurgamma Temple) దసరా ఉత్సవాలు (Dasara Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ(సోమవారం) సరస్వతిదేవి అలంకారంలో దుర్గమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. దుర్గమ్మను తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Sivanath) దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో కేశినేని శివనాథ్ మాట్లాడారు. మూలా నక్షత్రం రోజైన నేడు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని చెప్పుకొచ్చారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(సోమవారం మధ్యాహ్నం 3:30లకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఆ సమయంలో కూడా భక్తులు క్యూలైన్లు కొన్ని నడుపుతామని వివరించారు. భక్తుల రద్దీ ఎక్కువుగా ఉన్నందున అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే పెద్ద సంఖ్యలో భక్తులు దసరా ఉత్సవాలకు వస్తున్నారని వెల్లడించారు. ఇటీవల ఒకే రోజు లక్షన్నర మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఆర్ట్ ఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నీ పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టామని వివరించారు ఎంపీ కేశినేని శివనాథ్.
88 శాతం ప్రజలు దసరా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. ఈరోజు కూడా భక్తుల కోసం నాలుగు వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. కంపార్ట్‌మెంట్‌ల ద్వారా క్యూలైన్‌లోకి భక్తులను వదులుతున్నారని తెలిపారు. చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే సరి చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని, మన రాష్ట్రం, మన దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన అరకు కాఫీ.. సీఎం చంద్రబాబు అభినందనలు
తిరుమలలో గరుడ సేవకు భారీగా భక్తులు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
Read Latest AP News And Telugu News