CM Chandrababu ON Araku Coffee: ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన అరకు కాఫీ.. సీఎం చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Sep 28 , 2025 | 10:57 AM
అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు అవిశ్రాంతంగా, అంకితభావంతో కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు స్థిరమైన ఆదాయాలను పొందుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో ఛేంజ్ మేకర్ ఆఫ్ దా ఇయర్-2025 అవార్డును అరకు కాఫీ (Araku Coffee) దక్కించుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(X) వేదికగా ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు.
అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు అవిశ్రాంతంగా, అంకితభావంతో కృషి చేశారని ప్రశంసించారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు స్థిరమైన ఆదాయాలను పొందుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయీ గుర్తింపును సాధించారని కొనియాడారు. అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్న గిరిజన కో-ఆపరేటీవ్ కార్పొరేషన్‌కి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం:మంత్రి కందుల దుర్గేష్
గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News