Minister Durgesh on Tourism: కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం: మంత్రి కందుల దుర్గేష్
ABN , Publish Date - Sep 27 , 2025 | 07:27 PM
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రకృతి అందాలను అభివృద్ధి చేయడం ద్వారా నేడు అద్భుతమైన ప్రదేశాలుగా మారాయని వివరించారు. పర్యాటక రంగంలో సుస్థిరమైన మార్పు వచ్చిందని చెప్పడానికి ఏపీ ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
విజయవాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏపీలో పర్యాటక రంగానికి స్వర్ణ యుగం లాంటి దశ, దిశను సీఎం చంద్రబాబు కల్పిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ 15 నెలల కాలంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం వచ్చిందని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ జైన్, అమలాపాల్, పర్యాటకశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ కార్వాన్ టూరిజం బస్సులను పరిశీలించారు సీఎం. బస్సులో ఉన్న సౌకర్యాలు, వసతులు గురించి సీఎంకు వివరించారు అధికారులు.
బస్సులో డైనింగ్ తరహా ఏర్పాట్లు కూడా ఉంటే బాగుంటుందని సూచించారు సీఎం. ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుని.. అవసరమైతే మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రకృతి అందాలను అభివృద్ధి చేయడం ద్వారా నేడు అద్భుతమైన ప్రదేశాలుగా మారాయని వివరించారు. పర్యాటక రంగంలో సుస్థిరమైన మార్పు వచ్చిందని చెప్పడానికి ఏపీ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. క్యాపిటల్, సోషలిజం, కమ్యూనిజం గురించి చాలామంది మాట్లాడతారని.. కానీ వాటి గురించి మనకు వద్దని.. మనం టూరిజం గురించి మాత్రమే మాట్లాడదామని సీఎం చంద్రబాబు తమకు చెప్పారని గుర్తుచేశారు మంత్రి కందుల దుర్గేష్.
చంద్రబాబు కారణంగా నేడు రూ.10,644 కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి నిధులు ఇచ్చి సహకరిస్తోందని తెలిపారు. నేడు కొత్త కొత్త పాలసీల విధానాలను తెచ్చి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేస్తూ.... సరికొత్త పర్యాటక ప్రాంతాలను ఆవిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కార్వాన్ టూరిజం బస్సుల ప్రత్యేకతలను ఇప్పుడు అందరూ చూశారని తెలిపారు. పర్యాటక శాఖలో ఉన్న అధికారుల టీమ్ సమష్టిగా పని చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారని ప్రశంసించారు. తమ వెనుకాల చంద్రబాబు ఉంటూ.. ఎప్పటికప్పుడూ ప్రోత్సహిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
టూరిజం అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్: ఐఏఎస్ అధికారి అజయ్ జైన్
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవమని.. ఇదే రోజు 2000 సంవత్సరంలో చంద్రబాబుతో కలిసి ఆయన ఆలోచనలు పంచుకున్నానని ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత నేడు మళ్లీ టూరిజం కొత్త పాలసీని ఏపీలో అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఇప్పుడు చంద్రబాబు ద్వారా టూరిజం గైడ్ లైన్స్‌ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక రాష్ట్రంగా ఏపీని అభివృద్ది చేసేందుకు అనేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది ఏపీ వ్యాప్తంగా 8 మెగా ఈవెంట్లు, ప్రతి జిల్లాలో ఈవెంట్లు నిర్వహించామని తెలిపారు. టూరిజంలో 20శాతం గ్రోత్ తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని.. అదే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా టూరిజం అభివృద్దిలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేది తమ టార్గెట్ అని ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్
వాళ్లకు ఒకలా... మాకు ఒకలానా... మండలిలో ‘కాఫీ’పై వార్
Read Latest AP News And Telugu News