Share News

YSRCP MLAs Absenteeism: వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్‌

ABN , Publish Date - Sep 27 , 2025 | 10:36 AM

వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ ఉందంటూ ప్రభుత్వ విప్ ఎద్దేవా చేశారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావాలనే చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

YSRCP MLAs Absenteeism: వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్‌
YSRCP MLAs Absenteeism

అమరావతి, సెప్టెంబర్ 27: వైసీపీ ఎమ్మెల్యేలపై (YSRCP MLAs) ప్రభుత్వ విప్‌ రెడ్డప్పగారి మాధవి రెడ్డి (Government Whip Reddappa Gari Madhavi Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని సమస్యలపై చర్చించేందుకు సభకు రాని వైసీపీ సభ్యుల... జీతాల కోసం మాత్రం దొంగచాటుగా వస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి సభకు రాని.. ఆ పార్టీ సభ్యులు జీతాలు తీసుకోడానికి మాత్రం దొంగచాటుగా వస్తారా అంటూ రెడ్డప్పగారి మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ ఉందంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావాలనే చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. జీతాల కోసం మాత్రం దొంగచాటుగా సంతకాలు పెట్టిపోతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్యెల్యేలు సభలో ఇక దొంగచాటుగా సంతకాలు పెట్టి తప్పించుకోలేరన్నారన్నారు. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎంతసేపు సభలో ఉన్నారో తెలిసిపోతుందని చెప్పారు. సభకు రాకుండా దొంగ సంతకాలు చేసినవారి జాబితా తమ వద్ద ఉందని ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య

చివరి రోజుకు అసెంబ్లీ సమావేశాలు.. హాట్ టాపిక్స్ ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 11:06 AM