Share News

AP Assembly 2025: చివరి రోజుకు అసెంబ్లీ సమావేశాలు.. హాట్ టాపిక్స్ ఇవే

ABN , Publish Date - Sep 27 , 2025 | 09:52 AM

సూపర్ 6 సూపర్ హిట్‌పై అసెంబ్లీలో నేడు లఘు చర్చ జరుగనుంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలోని సమస్యలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.

AP Assembly 2025: చివరి రోజుకు అసెంబ్లీ సమావేశాలు.. హాట్ టాపిక్స్ ఇవే
AP Assembly 2025

అమరావతి, సెప్టెంబర్ 27: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఈరోజుతో (శనివారం) ముగియనున్నాయి. నేటి సమావేశాల్లో పలు అంశాలపై సభలో చర్చించనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 (Super Six) సూపర్ హిట్‌పై అసెంబ్లీలో నేడు లఘు చర్చ జరుగనుంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సభలో సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలోని సమస్యలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.


అసెంబ్లీలో నేటి ప్రశ్నోత్తరాలు

రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ పోస్టులు, నెల్లూరు-ముంబై జాతీయ రహదారి అనుసంధానం, గోదావరి నదిలో జల కాలుష్యం, సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలు, అన్నదాత సుఖీభవ పథకంపై సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే గృహ నిర్మాణం కోసం కొత్త లే ఔట్లు, ఏపీఎండీసీ బాండ్లు, చీరాల నియోజకవర్గంలో తీర ప్రాంత పర్యాటకం, ఆర్ అండ్ బీ భూముల ఆక్రమణ, ఫిష్ ఆంధ్ర విక్రయ కేంద్రాల ప్రశ్నలపై సభలో చర్చ జరుగనుంది.


అటు ఏపీ శాసనమండలిలో ఈరోజు వ్యవసాయ రంగంపై లఘు చర్చ కొనసాగనుంది. మెగా డీఎస్సీపై లఘు చర్చ చేపట్టనుంది మండలి.

శాసనమండలిలో నేటి ప్రశ్నోత్తరాలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, పర్యావరణ రహిత జనసంచార సంచులను ప్రోత్సహించడం, ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు, దేశభక్తి, జాతీయ విలువలు పాఠ్యంశాల్లో చేర్చుట, జలవనరుల శాఖలో జోనల్ వ్యవస్థ అమలు, తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపు, దుల్హన్ పథకం, విద్యుత్ సరఫరాలో అంతరాయం, గిరిజన ప్రజలు సాగు చేసే భూములకు పట్టాలు, శ్రీశైలం డ్యాం భద్రతా చర్యలు తదితర ప్రశ్నలపై మండలిలో చర్చ జరుగనుంది.


కాగా.. గత తొమ్మిది రోజులుగా జరిగిన సమావేశాల్లో అనేక కీలక బిల్లులకు సభ ఆమోద ముద్ర వేసింది. పలు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశాలను నిర్వహించారు. ముందుగా బీఏసీ మీటింగ్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ తరువాత సమావేశాల తేదీని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27 వరకు అంటే నేటి వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఇవి కూడా చదవండి..

ఆరవ రోజుకు దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 09:56 AM