Share News

Coffee Controversy: వాళ్లకు ఒకలా... మాకు ఒకలానా... మండలిలో ‘కాఫీ’పై వార్

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:01 AM

వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ విషయంపై సభకు చర్చ జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతూ సభను స్తంభింపచేశారు.

Coffee Controversy: వాళ్లకు ఒకలా... మాకు ఒకలానా... మండలిలో ‘కాఫీ’పై వార్
Coffee Controversy

అమరావతి, సెప్టెంబర్ 27: ఏపీ శాసనమండలి సమావేశాల్లో (ap legislative council) కాఫీ విషయంలో రగడ చోటు చేసుకుంది. మండలిలో ఇచ్చే కాఫీకి, అసెంబ్లీలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటోందని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు (AP Legislative Council Chairman Moshan Raju) అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభలో, మండలిలో ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. శాసనసభ, మండలిలో కాఫీ, భోజనాల విషయంలో తేడా ఎక్కడా లేదని వివరణ ఇచ్చారు.


ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ విషయంపై సభలో చర్చ జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతూ సభను స్తంభింపచేశారు. సభలో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.


నల్లకండువాలతో సభకు..

ఇదిలా ఉండగా... ఈరోజు ఉదయం శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా ఛైర్మన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే వైసీపీ సభ్యుల ఆందోళనతో ప్రశ్నోత్తరాలకు అంతరాయం ఏర్పడింది. ఛైర్మన్‌కు గౌరవం ఇవ్వాలంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. ఛైర్మన్‌కు అవమానం అంటూ నల్ల కండువాలతో సభకు వచ్చారు వైసీపీ సభ్యులు. ఈ విషయంలో కల్పించుకున్న మంత్రి పయ్యావుల.. బ్రేక్ సమయంలో ఛైర్మన్‌ చాంబర్‌‌లో చర్చిద్దామని అన్నారు. అయితే ముందు చర్చలు జరిపిన తర్వాతే సభ జరుపుదామని వివక్షనేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. ఈ క్రమంలో కాసేపు సభలో రగడ చోటు చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చివరి రోజుకు అసెంబ్లీ సమావేశాలు.. హాట్ టాపిక్స్ ఇవే

వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 11:22 AM