AP Assembly: అసెంబ్లీ ఎదుట వైసీపీ ఎమ్మెల్సీల నిరసన..
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:27 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చివరిరోజుకు చేరుకున్నాయి. దాదాపు వారం రోజులుగా.. వాడివేడీగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. దాదాపు వారం రోజులుగా.. వాడివేడీగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. నల్ల కండువాలు వేసుకుని ఆందోళన చేపట్టారు. మండలి చైర్మన్ గౌరవాన్ని కాపాడాలని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని నినాదాలు చేశారు. గేట్‌లో నుంచి నినాదాలు చేసుకుంటూ.. కార్యాలయం వరకు వచ్చారు. నిన్న(శుక్రవారం) మండలిలో కూడా చైర్మన్‌ను ప్రభుత్వం అగౌరవ పరుస్తుందంటూ.. వైసీపీ MLCలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు