Home » Dasara
పండుగల సీజన్‌లో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్ నుంచి.. సికింద్రాబాద్ మీదుగా యశ్వంతపూర్ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి తిరిగివస్తున్నారు. ఉద్యోగులకు దసరా సెలవులతో పాటు వీకెండ్ కూడా కలిసి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల్లో రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్లు మద్యం అమ్మకాలు చేసినట్లు పేర్కొన్నారు.
దుర్గామాత నిమజ్జనంలో అపశృతి జరిగింది. ఖండ్వా జిల్లాలో దుర్గామాతను నిమజ్జనం కోసం తీసుకెళుతుండగా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
మైసూరులో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న దసరా ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జనం వచ్చారు.
బతుకమ్మ పండుగతో ప్రారంభమైన షాపింగ్ సందడి, దసరా పండుగ ముందు రోజు వరకూ కొనసాగుతూనే ఉంది. పండుగ వేళ నూతన వస్త్రాలను కొనడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలోనూ జోష్ కనిపించింది.
అందరికీ ఆ పరమేశ్వరి చల్లని దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తుందని తెలిపారు.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా గురువారం నాడు మద్యం, మాంసం దుకాణాలు బంద్ కావడంతో.. సిటీలోని వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. నగరంలో ఎక్కడ చూసినా మాంసం, మద్యం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన జంబూసవారికి రాచనగరి సిద్ధమవుతోంది. గురువారం మధ్యాహ్నం జంబూసవారి వేడుకలు జరగనున్నాయి. వందలాది కళాబృందాలు, అశ్వదళం సాగుతుండగా గజరాజుల ఊరేగింపు జంబూసవారిలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
విజయదశమి లేదా దసరా పండుగ హిందూ, సిక్కు ప్రజనీకానికి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పవిత్ర దినాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు.. సిక్కు సామ్రాజ్యానికి కమాండర్ హరిసింగ్ నల్వా..