Dussehra festival: దసరా వ్యాపారం 4000 కోట్లు..
ABN , Publish Date - Oct 02 , 2025 | 08:07 AM
బతుకమ్మ పండుగతో ప్రారంభమైన షాపింగ్ సందడి, దసరా పండుగ ముందు రోజు వరకూ కొనసాగుతూనే ఉంది. పండుగ వేళ నూతన వస్త్రాలను కొనడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలోనూ జోష్ కనిపించింది.
- నగరంలో జరిగిన కొనుగోళ్లపై ఓ అంచనా
- ఒక్క వస్త్ర వ్యాపారంలోనే రూ.1500 కోట్లు
- ఆటోమొబైల్ రంగంలో రూ.1000 కోట్లు
- ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్స్‌సలోనూ సందడి
- వన్నె కోల్పోయిన ఆభరణం
- చిరువ్యాపారుల్లో కనిపించని సంతోషం
హైదరాబాద్ సిటీ: బతుకమ్మ పండుగ(Dussehra festival)తో ప్రారంభమైన షాపింగ్ సందడి, దసరా పండుగ ముందు రోజు వరకూ కొనసాగుతూనే ఉంది. పండుగ వేళ నూతన వస్త్రాలను కొనడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలోనూ జోష్ కనిపించింది. అలాగే, ఎలకా్ట్రనిక్స్, హోమ్ అప్లయెన్సస్ అమ్మకాల్లో జోరు కనిపించినప్పటికీ ఆన్‌లైన్‌తో పోలిస్తే, ఆఫ్‌లైన్‌లో ధరలు కాస్త ఎక్కువగానే ఉండటం, బ్యాంక్ ఆఫర్లు కలిసి రావడంతో సూపర్‌మార్కెట్లలో అమ్మకాల జోరు పెద్దగా కనిపించలేదని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం అయితే వన్నె కోల్పోయింది. మొత్తంగా దసరా, బతుకమ్మ సీజన్‌లో నగరంలో సుమారు 4వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగి ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
10వేల కార్లు, 30 వేల బైక్‌లు..
గత సీజన్‌తో పోలిస్తే ఈ దసరాకు అమ్మకాలు భారీగానే జరిగాయని ఎక్కువ మంది చెబుతున్నారు. పండుగకు ముందు ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్‌టీ సంస్కరణలతో ఆటోమొబైల్ రంగం లాభపడిందని అంటున్నారు. పండుగకు ముందు సరిగ్గా నాలుగు రోజుల్లో నగరంలో 5వేలకు పైగా కార్లు అమ్ముడుపోయినట్లు ఆటోమొబైల్ రంగ నిపుణులు మంచికంటి సంతోష్ తెలిపారు. ఈ అమ్మకాలలో 50ు మారుతీవే అన్నారు. పలు సంస్థలు, డీలర్లు ప్రకటించిన ఆఫర్లతో భారీగా లబ్ధి కలుగుతుండటంతో ఎక్కువ మంది కార్ల కొనుగోలుకు మొగ్గు చూపారంటున్నారు. మొత్తంమీద ఈ 10 రోజుల పండుగ కాలంలో నగరంలో 10వేలకు పైగా కార్లు, 30 వేలకు పైగా బైక్‌లు అమ్ముడయ్యాయని ఈ రంగాల్లోని ప్రముఖులు వెల్లడిస్తున్నారు. గత సంవత్సరంతో పొలిస్తే తమ అమ్మకాలు 40ుకు పైగానే పెరిగాయని ఎంజీ రోడ్‌లోని హోండా షో రూమ్ ఇన్‌చార్జ్ సైమన్ తెలిపారు. దసరా పండుగ పది రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు అమ్మకాలు నగరంలో జరిగి ఉంటాయని అంచనాగా పేర్కొంటున్నారు.
మాల్స్‌లో సందడి
ఆటోమొబైల్ రంగం తర్వాత మాల్స్‌లో సందడి కనిపించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి లాంటి చోట్ల ఉన్న మాల్స్‌లో రద్దీ అధికంగా ఉంది. పలు ఎలకా్ట్రనిక్ షోరూమ్‌లలో కూడా ఈ సందడి కనిపించిందని పంజాగుట్టలోని ఓ ఎలకా్ట్రనిక్స్ షోరూమ్ ప్రతినిధి ముజీబ్ తెలిపారు. ఆఫర్లకు తోడు జీఎ్‌సటీ తగ్గింపు ధరలు, ఆన్‌లైన్‌లో పోటీగా ధరలు అందించడం వల్ల గతంతో పోలిస్తే ఎక్కువ మంది కొనుగోళ్లు చేశారని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సస్ రంగంలో 25-30ు వరకూ వృద్ధి చూశామని వెల్లడించారు.
చిన్నబోయిన చిరు వ్యాపారం
దసరా సీజన్‌లో ఒక్క వస్త్ర వ్యాపారం పైనే నగరంలో 1500 కోట్ల రూపాయల అమ్మకాలు ఉండొచ్చని ఓ బ్రాండెడ్ వస్త్ర కంపెనీ మేనేజర్ దర్యానీ అంచనా వేశారు. అయితే కొనుగోళ్లు అంతగా లేవని చిన్న వ్యాపారులు పేర్కొంటున్నారు. మాల్స్, పెద్ద షోరూమ్‌లలో భారీగా ఆఫర్లను ప్రకటించడంతో ఎక్కువ మంది అటువైపే చూశారు కానీ చిరు వ్యాపారులను పట్టించుకోలేదంటున్నారు. తమ వద్ద దాదాపు 70-80ు అమ్మకాలు పడిపోయాయని స్వప్నలోక్ వద్ద షాప్ అండ్ గో నిర్వాహకుడు శ్రీకాంత్ వాపోయారు. బంగారం వ్యాపారమైతే భారీగా పడిపోయిందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 50 శాతానికి పైగా అమ్మకాలు పడిపోయాయని ఓ జ్యువెలర్ షాప్ నిర్వాహకుడు ఆకుల ప్రతాప్ తెలిపారు. నిత్యావసరాల పరంగా హైపర్, డిస్కౌంట్ స్లోర్లలో కనిపించిన సందడి తమ వద్ద కనిపించలేదని కిరాణా వ్యాపారులు చెబుతున్నారు.
ఆటో మొబైల్ విక్రయాలు బాగున్నాయి
ఈ దసరా నగరంలోని ఆటో డీలర్లకు అసలైన సంతోషం తీసుకువచ్చింది. జీఎ్‌సటీ తగ్గడంతో కార్లను గతంలో ఎన్నడూ లేనంతగా కొన్నారు. నాలుగు రోజుల్లోనే 5 వేల కార్లను కొన్నారు.
- మంచికంటి సంతోష్,
ఆటోమొబైల్ నిపుణుడు అమ్మకాలు లేవు
గత సంవత్సరం బంగారం విక్రయాలు బాగానే జరిగాయి. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. బంగారం ధర పెరగడమే దీనికి కారణం.
- చేలారం చౌదరి, హేమ జ్యువెలర్స్. రాజేంద్ర నగర్
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Read Latest Telangana News and National News