Share News

Indian billionaires: టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

ABN , Publish Date - Oct 02 , 2025 | 07:15 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి మనదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. హరున్ ఎం3ఎం తాజాగా ఇండియా సంపన్నుల జాబితా-2025ను ప్రకటించింది. కుటంబ సభ్యుల సంపదతో కలిపి ముఖేష్ మొత్తం ఆస్తి 9.55 లక్షల కోట్ల రూపాయలు.

Indian billionaires: టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Mukesh Ambani and Gautam Adani

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి మనదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. హరున్ ఎం3ఎం తాజాగా ఇండియా సంపన్నుల జాబితా-2025ను ప్రకటించింది (Hurun India Rich List). కుటంబ సభ్యుల సంపదతో కలిపి ముఖేష్ మొత్తం ఆస్తి 9.55 లక్షల కోట్ల రూపాయలు (Mukesh Ambani net worth). ఇక, ఈ జాబితాలో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ 8.15 లక్షల కోట్ల రూపాయల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు (Gautam Adani net worth).


ఇక, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. మొత్తం 2.84 లక్షల కోట్ల సంపదతో రోష్ని నాడార్ దేశంలోనే అత్యంత ధనికురాలైన మహిళగా నిలిచారు. దేశంలోని టాప్-3 సంపన్నుల జాబితాలో ఒక మహిళ చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. అలాగే 44 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి చిన్న వయసులోనే టాప్-10 సంపన్నురాలిగా నిలిచిన మహిళగా రోష్ని ఘనత దక్కించుకున్నారు.


దేశంలోని టాప్-10 ధనవంతులు వీళ్లే..

  1. ముఖేష్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్) - రూ. 9.55 లక్షల కోట్లు

  2. గౌతమ్ అదానీ (అదానీ గ్రూప్) - రూ. 8.15 లక్షల కోట్లు

  3. రోష్నీ నాడార్ (హెచ్‌సీఎల్ టెక్నాలజీస్) - రూ. 2.84 లక్షల కోట్లు

  4. సైరస్ పూనావాలా (సీరస్ ఇనిస్టిట్యూట్) - రూ. 2.64 లక్షల కోట్లు

  5. కుమార్ మంగళం బిర్లా (బిర్లా గ్రూప్) - రూ.2.32 లక్షల కోట్లు

  6. నీరజ్ బజాజ్ (బజాజ్ గ్రూప్) - రూ. 2.32 లక్షల కోట్లు

  7. దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా) - రూ. 2.3 లక్షల కోట్లు

  8. అజీమ్ ప్రేమ్ జీ (విప్రో) - రూ.2.21 లక్షల కోట్లు

  9. గోపీచంద్ హిందుజా (హిందుజా గ్రూప్) - రూ.1.85 లక్షల కోట్లు

  10. రాధాకిషన్ ధమానీ (డీమార్ట్) - రూ.1.82 లక్షల కోట్లు


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 07:15 AM