Share News

New York Woman: నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

ABN , Publish Date - Oct 01 , 2025 | 04:03 PM

న్యూయార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్న మహిళపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలి వేయాలంటూ ఆ వ్యక్తిని ఆమె ప్రాధేయపడింది. కానీ అతడు కనికరించలేదు.

New York Woman: నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

వాషింగ్టన్, అక్టోబర్ 01: అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్న మహిళపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో అతడిని నిరోధించేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించింది. తనపై అత్యాచారం జరపకుండా ఉండేందుకు నగదు సైతం ఇస్తానంటూ ఆ వ్యక్తిని ఆమె ప్రాధేయపడింది. కానీ ఆమె మాటలను అతడు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆమెపై పలుమార్లు దాడి చేసి.. మరి అత్యాచారం జరిపాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

man.jpg


అనంతరం ఆమె పర్స్‌తోపాటు ఐడీ కార్డు, ఇంటి తాళాలు తీసుకుని అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు పరుగు తీశాడు. ఈ దారుణ ఘటన న్యూయార్క్‌ మహానగరంలోని నుర్‌వుడ్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయాలుపాలైన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడి పేరు కెన్నెత్ సిరిబీ‌గా గుర్తించారు. ఈ అత్యాచారానికి పాల్పడిన అనంతరం అతడు అపార్ట్‌మెంట్ మెట్లు దిగి.. వెళ్లిపోతున్న వీడియోను న్యూయార్క్ నగర పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ అపార్ట్‌మెంట్‌లోకి కెన్నెత్ సిరిబీ ఎలా ప్రవేశించాడని అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


మరోవైపు అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అతడికి కోర్టు రిమాండ్ విధించింది. ఇంకోవైపు ఈ ఏడాది జులైలో బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్ వద్ద థాయ్ మోడల్‌పై కెన్నెత్ సిరిబీ దాడి చేసి.. ఆమె వద్ద నుంచి నగదు దోచుకుని పరారయ్యాడు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అతడు ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై బయట ఉన్నాడని పోలీసులు తెలిపారు.


ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ ప్రాంతంలో 399 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి 314 ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. అంటే ఈ తరహా నేరాలు ఈ ఏడాది 27 శాతం మేర పెరిగాయంటూ ప్రభుత్వం వెల్లడించింది.


మరిన్ని వార్తలు చదవండి..

జగన్ ఓటమితో ఏపీకి స్వాతంత్ర్యం వచ్చింది..

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..

For More International News And Telugu News

Updated Date - Oct 01 , 2025 | 04:30 PM