Chandrababu Naidu: జగన్ ఓటమితో ఏపీకి స్వాతంత్ర్యం వచ్చింది..
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:48 PM
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డల కోసం స్త్రీశక్తి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు.
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో పెన్షన్ల రూపంలో పేదలకు రూ.48,019 కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెన్షన్ డబ్బును 10 రేట్లు పెంచిన ఘనత టీడీపీదే అని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం అమలులో ఎన్డీయే ప్రభుత్వం టాప్‌లో ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి నెలా ఒకటినే పెన్షన్ల పండుగ చేసుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్..
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డల కోసం స్త్రీశక్తి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. తాను తుగ్లక్‌ను కాదని.. కక్షసాధింపు లేదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఓటమితో.. ఏపీకి స్వాతంత్ర్యం
ప్రజలు సంతోషానికి వీలు లేకుండా గత సీఎం జగన్ పాలన చేశారని చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వంలో కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో జగన్ పర్యటనకు వస్తే చెట్లు నరికేవారని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో.. అన్ని ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. జగన్ ఓటమితో ఏపీకి స్వాతంత్ర్యం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో తుగ్లక్ పాలన పోయిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఖర్గేకు అస్వస్థత.. గుండెకు పేస్‌మేకర్
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..