Home » Vizianagaram
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఏడాది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు.
వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు. సుమారుగా 200 కుటుంబాలు ఫ్యాన్ పార్టీని వదలి పసుపు కండువా కప్పుకున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అగ్రనేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లుపెట్టారని ఆరోపణలు చేశారు.
జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం 91.7 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు.
తెలుగు టీవీ జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించిందని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసించారు. దమ్మున్న, మనసున్న ఛానల్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిలిచిందని కొనియాడారు.
పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని... చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసమే పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు కష్టాలు లేని ఇబ్బందులు లేని సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు.
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డల కోసం స్త్రీశక్తి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు.