MP Kalisetty: ఆ ఘటన నా పూర్వజన్మ సుకృతం.. ఎంపీ కలిశెట్టి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:04 PM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఏడాది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు.
విజయనగరం, జనవరి1 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై (Boghapuram International Airport) తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Kalisetty Appalanaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఈనెల 4వ తేదీన తొలి అధ్యాయం మొదలవుతుందని పేర్కొన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఇవాళ(గురువారం) విజయనగరంలో ఎంపీ కలిశెట్టి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో సాంకేతిక, ఆర్థిక ప్రగతి, భోగాపురంలో అధునాతన విమానయాన రంగ వికాసం విశ్వఖ్యాతి పొందుతోందని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర దశ, దిశకు రెండు కళ్లుగా మారిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తమ ప్రాంతం రుణపడి ఉంటుందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే తొలి విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తాను ప్రయాణించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News