Bhogapuram International Airport: మరికొద్దిసేపట్లో భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:41 AM
ఈ రోజు (ఆదివారం) ట్రయల్ రన్‌గా బిజినెస్ ఫ్లయిట్ మరికొద్దిసేపట్లో భోగాపురం విమానాశ్రయంలో దిగనుంది. సరిగ్గా ఉదయం 10:15 నిమిషాలకు విమానం విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది.
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 96 శాతం పూర్తయింది. జూన్ 26వ తేదీన పూర్తి స్థాయిలో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆదివారం) ట్రయల్ రన్‌గా బిజినెస్ ఫ్లయిట్ మరికొద్దిసేపట్లో విమానాశ్రయంలో దిగనుంది. సరిగ్గా ఉదయం 10:15 నిమిషాలకు విమానం విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భోగాపురం బయలు దేరారు.

భారీ తుఫానులను సైతం తట్టుకునేలా నిర్మాణం
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు హుద్‌హుద్ వంటి భారీ తుఫానులను సైతం తట్టుకునేలా నిర్మితమవుతోంది. గంటకు 27 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచినా విమానాశ్రయం చెక్కు చెదరదు. 27 సెంటీమీటర్ల వర్షం వచ్చినా నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. తొలి దశలోనే ప్రతి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
అతడికి అన్యాయం జరిగింది.. సెలక్టర్లపై షమీ కోచ్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీకి బిగ్ షాక్.. షేక్ నియాజ్ అహ్మద్ రాజీనామా