Shami: అతడికి అన్యాయం జరిగింది.. సెలక్టర్లపై షమీ కోచ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:43 AM
న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన తుది జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. దీంట్లో సీనియర్ పేసర్ షమీకి చోటు దక్కలేదు. ఈ విషయంపై అతడి వ్యక్తిగత కోచ్ సెలక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: జనవరి 11 నుంచి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్‌తోనూ తలపడనుంది. అయితే వన్డే సిరీస్ మాత్రం తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. దేశవాళీల్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై షమీ వ్యక్తిగత కోచ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
‘ఒక ఆటగాడు ఇంత కంటే ఇంకేం చేయగలడు? షమీ(Mohammed Shami) ఇంకెన్ని వికెట్లు తీస్తే జట్టులోకి తీసుకుంటారు? షమీని ఎంపిక చేయలేదంటే అర్థం వారికి వన్డే జట్టులో అతడి అవసరం లేదని వారు అనుకున్నారు. కానీ దేశానికి అందించడానికి అతడి వద్ద ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది’ అని షమీ కోచ్ చెప్పుకొచ్చారు.
ఇది అన్యాయం..
షమీ ఎంపికపై బెంగాల్ కోచ్ లక్ష్మీ రతన్ కూడా సెలక్షన్ కమిటీని తప్పుబట్టాడు. ‘షమీకి సెలక్షన్ కమిటీ అన్యాయం చేసింది. ఇటీవల కాలంలో అతడు దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంత అంకితభావంతో డొమెస్టిక్ ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ ఎవ్వరూ లేరు. షమీ పట్ల సెలక్షన్ కమిటీ ఇలా ప్రవర్తించడం అవమానకరం’ అని తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం!