Big Shock To YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. షేక్ నియాజ్ అహ్మద్ రాజీనామా
ABN , Publish Date - Jan 04 , 2026 | 08:59 AM
అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో వేలాది మంది అనుచరులతో బైక్ ర్యాలీగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
అనంతపురం అర్బన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు(ఆదివారం) అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వేల మంది అనుచరులతో భారీ బైక్ ర్యాలీతో టీడీపీలో చేరనున్నారు.
వరుస రాజీనామాలు
వైఎస్సార్ సీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. గత నెలలో తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. గోపాలపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నడుస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం, నియోజవర్గ ఇన్‌చార్జ్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ఆ ఇష్యూ కాస్తా చినికిచినికి గాలి వానగా మారింది. పార్టీ నాయకులు తమను పట్టించుకోవటం లేదంటూ మండల స్థాయి నేతలు, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు అలక వహించారు. ఈ క్రమంలోనే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేశారు.
ఇవి కూడా చదవండి
ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా
ఏపీలో అమానవీయ ఘటన.. ఏడేళ్ల చిన్నారిపై..