Rammohan Naidu: భోగాపురం విమానాశ్రయంలో ప్రయాణాలపై కేంద్రమంత్రి క్లారిటీ
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:43 PM
భోగాపురం విమానాశ్రయ అన్ని పనులు పూర్తి అయ్యాయని చెప్పటం కోసమే ఈ రోజు టెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ జరిగిందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జీఎంఆర్, మాన్సాస్ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజక్ట్ ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నాయని వివరించారు.
విజయనగరం, జనవరి4(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో (Bhogapuram International Airport) తొలి విమానం దిగింది. ఇవాళ(ఆదివారం) ఉదయం10:15 గంటలకు తొలి బిజినెస్ ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు చేరుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో 300 విమానాలు దిగే సదుపాయం కల్పించింది. తొలి దశ నిర్మాణ పనులకు రూ.4,592 కోట్ల వ్యయం అయింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister Kinjarapu Rammohan Naidu) మీడియా సమావేశం నిర్వహించారు.
సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టికి ప్రతి రూపం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఉద్విగ్నభరితమైన క్షణాలను అనుభవించానని తెలిపారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మీరు చేరుకున్నారనే మాట విమానంలో వినిపించే సరికి ఎంతో పులకించిపోయానని పేర్కొన్నారు. 96 శాతం విమానాశ్రయ పనులు పూర్తి అయ్యయని తెలియచేయటానికి ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు రామ్మోహన్ నాయుడు.
విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు అందించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని పనులు పూర్తి అయ్యాయని చెప్పటం కోసమే ఈ రోజు టెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ జరిగిందని వెల్లడించారు. జీఎంఆర్, మాన్సాస్ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నాయని వివరించారు. ఏరోస్పెస్ ఎడ్యుసిటీతో అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ
Read Latest AP News And Telugu News