Share News

Ashok Gajapathi Raju: జగన్ హయాంలో నాపై కేసులు పెట్టారు.. అశోక్ గజపతిరాజు ఫైర్

ABN , Publish Date - Dec 14 , 2025 | 03:44 PM

జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Ashok Gajapathi Raju: జగన్ హయాంలో నాపై కేసులు పెట్టారు.. అశోక్ గజపతిరాజు ఫైర్
Ashok Gajapathi Raju

విజయనగరం, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి రాబోయే రోజుల్లో ఎక్కడ జరగదని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అశోక్ గజపతిరాజు.


ఇవాళ(ఆదివారం) విజయనగరం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజుని క్షత్రియ పరిషత్ ఈరోజు సత్కరించింది. అనంతరం మీడియాతో అశోక్ గజపతిరాజు మాట్లాడారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో తనను కూడా అరెస్టు చేస్తారని చాలామంది అన్నారని.. అయితే తానేమీ భయపడి పారిపోలేదని పేర్కొన్నారు.


విశాఖపట్నంలో ఎనిమిది వందల ఎకరాల భూమిని తాను ఆక్రమించానని జగన్ హయాంలో తన మీద ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. కోర్టులో కేసులు కూడా వేశారని ప్రస్తావించారు. అయితే ఒక్క ఆధారాన్ని కూడా వైసీపీ నేతలు కోర్టుకు అందించలేకపోయారని గుర్తుచేశారు. ప్రజాధనాన్ని దొంగతనం చేసి,16 నెలలు జైల్లో ఉండి, బైయిల్‌పై వచ్చిన వ్యక్తిని ఏపీకి ముఖ్యమంత్రిని చేశామని విమర్శించారు. ఐదేళ్లలో ఏపీని అభివృద్ధి చేయలేదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 03:57 PM