Home » Ashok Gajapathi Raju
గోవా లోక్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజును ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న శ్రీను ఇటీవల టీడీపీలో చేరాక తొలిసారి అశోక్‌ను కలిసిన ఆయన విజయనగరం రాజకీయాలపై చర్చించారు.
గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు స్థలం వివాదంపై విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలం వివాదంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డులను పరిశీలించి ఆ స్థలాన్ని తిరిగి అశోక్ గజపతిరాజుకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
టీటీడీ కల్తీ లడ్డూ వ్యవహారంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్పందించారు. నెయ్యి తయారీపై జగన్ హయాంలో అవకతవకలు జరిగాయని ధ్వజమెత్తారు..
గోవా గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజుకు సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అభినందనలు తెలిపారు. అశోక గజపతిరాజు రాజకీయాల్లో ఉంటూ కూడా ఆదాయాన్ని సమకూర్చుకోకపోగా, తనకున్న సొంత ఆస్తి నుంచి రూ.1000 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారని ప్రశంసించారు.
జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను ధ్వంసం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు. వంశపారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్‌గజపతిరాజుతో బాంబే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజుని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్‌కి ఈ లేఖను పంపించారు.