నెయ్యి తయారీపై జగన్ హయాంలో అవకతవకలు: అశోక్ గజపతిరాజు
ABN , Publish Date - Feb 22 , 2026 | 08:27 PM
టీటీడీ కల్తీ లడ్డూ వ్యవహారంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్పందించారు. నెయ్యి తయారీపై జగన్ హయాంలో అవకతవకలు జరిగాయని ధ్వజమెత్తారు..
విజయనగరం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో జరిగిన టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆయన ఘాటుగా స్పందించారు. పాలు నుంచి పెరుగు, వెన్న.. తర్వాత నెయ్యి తయారవుతుందనే విషయం మరచిపోయేలా చేశారని చురకలు అంటించారు. నెయ్యి తయారయ్యేది రసాయనాలతోనా.? లేక జంతు కొవ్వుతోనా అనే విధంగా వ్యవహరించారని దెప్పిపొడిచారు. ఇవాళ(ఆదివారం) విజయనగరం మహారాజ కోటలోని మాన్సాస్ సంస్థ నిర్వహించిన ఓ ప్రత్యేక సమావేశానికి అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బొత్స సత్యనారాయణపై పరోక్ష విమర్శలు..
అమరావతీ నగర అపురూప శిల్పాలు అని పాడుతుంటామని.. అయితే బ్రిటీష్ వారు అమరావతి అపురూపాలను తమ ప్రదర్శనా శాలకు తరలించుకుపోయారని అశోక్ గజపతిరాజు గుర్తు చేశారు. అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దుకునే తరుణం ఇదేనని చెప్పుకొచ్చారు. మద్యం పంపిణీ చేస్తామని పిలుపునిస్తే ఒక గంటలో కోట మొత్తం కిక్కిరిసిపోతుందని.. అదే చదువుకోమని చెబితే రావటానికి సంకోచించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని ప్రస్తుత పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై పరోక్ష విమర్శలు చేశారు. తమ విద్యా సంస్థలో చదువుకున్న వ్యక్తి గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినా.. విద్యా వ్యవస్థ కుంటుపడిందని ఆయన సెటైర్లు విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
Read Latest Telangana News And AP News And Telugu News